అయోధ్య రాముడికి వెండి బాణాలు.. గిఫ్ట్‌గా ఇస్తామన్న ముస్లింలు

  • పది బాణాలను బహుమానంగా ఇవ్వాలని షియా వక్ఫ్ బోర్డు నిర్ణయం
  • ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ
  • ఉగ్రవాదంపై భారత్ పోరుకు ప్రతీకలని అభివర్ణన
అయోధ్యలో నిర్మించతలపెట్టిన 100 మీటర్ల అతిపెద్ద రాముడి విగ్రహానికి వెండి బాణాలు బహూకరించేందుకు ముస్లింలు ముందుకొచ్చారు.  ఈమేరకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ లేఖ రాసింది. రాముడికి తాము 10 వెండి బాణాలు ఇవ్వాలనుకుంటున్నట్టు అందులో పేర్కొంది. అయోధ్య రాముడికి వెండి బాణాలను బహుమానంగా ఇవ్వాలని షియాలు కోరుకుంటున్నారని బోర్డ్ చైర్మన్ వసీమ్ రిజ్వీ పేర్కొన్నారు.

తాము రాముడికి బహూకరించనున్న బాణాలు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న యుద్ధానికి ప్రతీకలని ఆయన అభివర్ణించారు. ‘‘మర్యాద పురుషోత్తముడైన రాముడు దుష్టశక్తులపై పోరాడి బాణాలతోనే రాక్షసులను సంహరించాడని, ఇప్పుడు తాము ఇవ్వబోయే బాణాలు కూడా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రతీకలని లేఖలో పేర్కొన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా జీవించాలని రిజ్వీ పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Shias
uttarpradesh
silver arrows
lord rama

More Telugu News